రోడ్డు ప్రమాదం లో 16 మందికి గాయాలు ఇద్దరు మృతి.

తిరుపతి జిల్లా : రైల్వే కోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండలం హైవే రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం. వివరాలు లొకి వెళ్ళితే…. ఆదివారం అర్ధరాత్రి సమయంలో తిరుపతి నుండి కడప కు వెళ్తున్న “ఏపీ 04 జెడ్ 0341” ఆర్టీసీ బస్సు పుల్లంపేట హైవే రోడ్డుపై ఒంటిగంట సమయంలో, ఎర్రగుంట్ల నుండి చెన్నై కి వెళ్లే “ఏపీ 04 యూబి 0735 ” నంబర్ గల ఆ లారీ డ్రైవర్ నిద్ర మత్తు లో ఆర్టీసీ బస్సు ను గుద్దడంతో బస్సు కుడి వైపు పూర్తిగా డ్యామేజ్ అయ్యి కుడి వైపు ఉన్న సుమారుగా పదహరు మంది ప్రయాణికులకు కాళ్ళు చేతులు తెగి గాయాలు అయినాయి.
ఒక సంవత్సరం వయసు గల బాబు సంఘటన స్థలం లోనే మృతి చెందగా, అర్ధరాత్రి సమయంలో రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న రైల్వే కోడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.శ్రీనివాసులు మరియు పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మిగతా వారిని చికిత్స కోసం పోలీస్ జీపు లో మరియు అంబులెన్సు లో వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజంపేట ప్రభుత్వ వైద్యాశాల లో రోగులకు చికిత్స చేసేదానికి సరైన డాక్టర్ లు లేక మరియు వసతులు, పరికరాలు, మందులు లేక మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించారు.
కె. జస్విక 16 సంవత్సరంలు అనే బాలిక రిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించింది.
రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న రైల్వే కోడూరు మరియు పుల్లంపేట మండలం ఇంచార్జి తహసీల్దార్ కోనేటి అమర్నాథ్, కడప రిమ్స్ హాస్పిటల్ లో ఉన్న క్షతగాత్రులను పరామర్శించి మరియు డాక్టర్ లతో మాట్లాడి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.



