Andhra Pradesh

ముగ్గురు బంగారు నగల దొంగలు అరెస్ట్….. రూరల్ సీఐ

తిరుపతి జిల్లా : రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబుళవారిపల్లి మండలం లో భారీగా జరిగిన నగల దొంగతనం కేషు వివరాలు గాను నేడు గురువారం రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం లో రేణిగుంట డి ఏస్పీ, వై శ్రీనివాస రావు మాట్లాడుతు…. తిరుపతి జిల్లా ఏస్పీ యల్. సుబ్బారాయుడు ఐపీస్, ఆదేశాలు మేరకు రైల్వే కోడూరు రూరల్ సీఐ డి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో
తిరుపతి జిల్లా, ఓబులవారిపల్లి మండలం, వై.కోట పంచాయతిలోని యద్దలవారిపల్లి గ్రామం నందు గల పిర్యాది యన్నారు అనంతమ్మ, భర్త: లేట్ ప్రసాద్ తన అన్న యద్దల ఈశ్వరయ్య పాత ఇంటిలో బీరువా నందు పెట్టి కువైట్ కు పోయి తిరిగి వచ్చి 19.6.26 వ తేదీన చూసుకోగా బీరువా లో గల సుమారు 10 తులాలు (రెండు బంగారు చైనులను, రెండు బంగారు హారములను మరియు మాటీలు, చెంప సరాలు, కమ్మలు, 2 బంగారు ఉంగరాలు) వాటి విలువ రూ.11,00,000/- లు మరియు అదే గ్రామంలో పిర్యాది యద్దల మౌనిక బెడ్ రూమ్ కబోర్డ్ లో పెట్టి న బంగారు నల్ల పూసల దండను, నాలుగు బంగారు గాజులు మరియు లాంగ్ చైన్, వాటి బరువు సుమారు 9 తులాలు వాటి విలువ 9,90,000/- ను ఈ నెల 5 వ తేదీ నుండి 10 వ తేదీ మధ్యలో ఎవరో దొంగిలించారని ఓబుళవారిపల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం తొ, సదరు రెండు కేసులలో 19 తులాలు బంగారం, వాటి విలువ రు.20,90,000/- లను దొంగిలించిన ముద్దాయిలలో 3 అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దొంగిలించిన బంగారు వస్తువులు 17 తులాల బంగారం, దాని విలువ సుమారు రూ.18,70,000/-.స్వాధీనం చేసుకొనడమైనదని,అందులో యన్నారు అనంతమ్మ యొక్క 10 తులాలు మరియు యద్దల మౌనిక యొక్క 7 తులాలు స్వాదీనమైనవన్నారు.
వై.కోట పంచయతిలోని యద్దలవారిపల్లి నందు రెండు ఇళ్ళలో జరిగిన దొంగతనం ఘటనలో పోలీసులు నిందుతులను పట్టుకోవడంలో విజయం సాధించరన్నారు.
25-06 -2025 వ తేదిన ఉదయం 10 గంటలకు ఓబులవారిపల్లి యస్ ఐ, కె.సుజాన్ కుమార్, సిబ్బంది నేతృత్వంలో వై.కోట పంచాయతీలోని ఎద్దులవారిపల్లె గ్రామము ఊరి బయట రైల్వేకోడూర్ నుండి వై .కోట, ఎద్దులవారిపల్లెకు పోవు మూడు రోడ్ల కూడలి వద్ద ఈ రెండు కేసులలోని ముదాయిలు ఏ2, ఏ 4 లను అరెస్ట్ చేశారన్నారు.
1) కొండేటి జ్యోతి ప్రకాష్ అలియాస్ పవన్, వయసు 19 సం”లు తండ్రి: రఘురామయ్య, కులం: బలిజ, ఎగువరెడ్డిపల్లె గ్రామం, పుల్లంపేట మండలం
2) ఉమ్మక శివ మనోజ్ అలియాస్ మనోజ్, వయస్సు 19 సం”లు,తండ్రి: శ్రీనివాసులు, కులం: బలిజ, ఎద్దులవారిపల్లి గ్రామం, Y.కోట, ఓబులవారిపల్లి మండలం
3) నందలూరు కౌశిక్ కుమార్ రెడ్డి అలియాస్ కౌశిక్, వయస్సు 20 సం”లు, తండ్రి: ప్రసాద్, కులం: కాపు, దాదివారిపల్లె, రాఘవ రాజపురం, రైల్వే కోడూరు.
స్వాధీనం చేసిన సొత్తు: సుమారు 170 గ్రాముల బంగారం, దాని విలువ సుమారు రూ.18,70,000/- ఉందన్నారు.
ముద్దాయిలలో ఇంకను ఎద్దుల అఖిల్ వర్ధన్ అలియాస్ అఖిల్, తండ్రి: ప్రసాద్, కులం: బలిజ, ఎద్దులవారిపల్లె గ్రామం, వై.కోట, ఓబులవారిపల్లె మండలం అనునతనిని అరెస్ట్ చేయవలసి ఉన్నది. దీనిపై పోలీస్ ప్రత్యెక నిఘా ఉంచడమైనదన్నారు.
ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి….
ఇటీవలి కాలంలో డబ్బు, నగదు ఉన్న ఇళ్ళను, తాళాలు వేసి ఉన్న ఇళ్ళను లక్ష్యంగా చేసుకుని నేరగాళ్లు సమాచారాన్ని సేకరించి దాడులకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అందువల్ల పెద్ద మొత్తంలో బంగారు, నగదు మరియు ఇతర విలువైన వస్తువులకు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని,
ఎవరైనా అనుమానితులు గ్రామంలో కనపడిన వెంటనే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలన్నారు.
ప్రజలు గ్రామంలో ఇంటికి తాళాలు వేసి ఊరికి వెళ్ళు సమయంలో పోలీస్ వారికి తప్పక తెలియజేయాలని అలాగే లమ్స్ (లాకడ్ హౌస్ మానిటరింగ్ సిస్టం ) ను ఉపయోగించుకోవాలి
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112కు కాల్ చేయాలన్నారు.
తిరుపతి జిల్లా ఎస్పీ యల్. సుబ్బారాయుడు ఐపీస్ హెచ్చరిక….
ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతకు భంగం కలిగించే నేరాలకు పాల్పడే వ్యక్తులపై తిరుపతి జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే ముఠాలను గుర్తించి చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్బంగా తెలిపారు.
ఈ కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన రూరల్ సీఐ డి. శ్రీనివాసులు మరియు యస్ ఐ, కె. సుజన్ కుమార్ మరియు వారి పోలీస్ బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button