Andhra Pradesh
గుట్కా మరియు పేకాట స్థావరాలపై దాడులు…. జిల్లా ఏస్పీ

మదనపల్లి జిల్లా: మదనపల్లెలో నేడు శనివారం జిల్లా సూపర్ డెంట్ అఫ్ పోలీస్ (ఏస్పీ) దీరాజ్ కునుబిల్లి ఐపీస్ ఆదేశాలు మేరకు మదనపల్లెలో 1వ టౌన్ పరిధిలోని ఓ గోడౌన్‌పై 4 ప్రత్యేక పోలీస్ బృందాలతో మెరుపుదాడి చేయగా,యువతను నిర్వీర్యం చేస్తున్న *’కూల్ లిప్’* సహా భారీగా నిషేధిత గుట్కా సీజ్ చేశారు.
అనంతరం సంబేపల్లి మండలం పరిధిలో 2 చోట్ల, పీలేరు మండలం పరిధిలో 2 చోట్ల పోలీసులు బృందం పేకాట స్తవరాలపై దాడులు చేయగా,మొత్తం 4 పేకాట శిబిరాల నుంచి 28 మందిని అరెస్ట్ చేసి రూ.80,690/- నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.
యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతూ మత్తు పదార్థాలు విక్రయించినా, పేకాట తదితర జూదాలకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో…. పోలీస్ అధికారులు పాల్గొన్నారు.



