ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి…. జిల్లా కలెక్టర్

తిరుపతి: తిరుపతి జిల్లాలో ఎస్సీ, ఎస్టీల కు సంబంధించిన సమస్యల పట్ల స్వయంగా తనిఖీ చేసి తక్షణమే పరిష్కారం చూపుతూ నిరంతర పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్పర్సన్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు.
నేడు బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, సత్యవేడు మరియు సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు కోనేటి ఆదిమూలం, నెలవల విజయశ్రీ లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతు…. గత సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఆయా శాఖల సమాధానాలను పరిశీలించిన అనంతరం, జాప్యం జరిగిన అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న అట్రాసిటీ కేసులు త్వరితంగా పరిష్కారమయ్యేలా కృషి చేయాలని కోరారు.డీవీఎంసీ లో ప్రస్తావించే ప్రతి అంశానికి అధికారులు పరిష్కారం చూపాల్సిన భాధ్యత ఉందని, సివిల్ రైట్స్ డే ప్రతి నెలా జరిపి ఎస్సీ/ఎస్టీ సమస్యలకు పరిష్కారం చూపాలని తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారం చూపేలా న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల ఇళ్లకు సంబంధించి పట్టాలు మంజూరు, భూ సమస్యలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నిర్మాణం వంటి సమస్యలపై కమిటీ సభ్యులు విన్నవించుకోగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. అంబేద్కర్ భవనం నిర్మాణం కోసం స్థలం కేటాయింపు విషయంలో పనులను పూర్తి చేయాలని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం ద్వారా లబ్ధిదారులకు గృహాలు మంజూరు సంబంధించిన స్థలాన్ని గుర్తించడం, మంజూరు చేయడం వంటి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి గృహాలను మంజూరు చేయాలని హౌసింగ్ డిపార్ట్మెంట్ వారి నీ ఆదేశించారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీల సమస్యల పై పరిష్కార దిశగా కృషి చేయాలి అని తెలిపారు. ఎస్సీ ఎస్టీల అల్ట్రాసిటీ తదితర కేసులను జాప్యం లేకుండా సంబంధిత అధికారులు సీరియస్ గా తీసుకొని పరిష్కరించేలా చూడాలని తెలిపారు. జిల్లాలోని మండల స్థాయి, జిల్లా స్థాయిలో లాండ్ ఆర్డర్ పాటిస్తూ కేసుల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని శాఖవారిని ఆదేశించారు. కమిటీ సభ్యులు అల్ట్రా సిటీ కేసులకు సంబంధించి ఎస్పికి విన్నవించుకోక వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి సంబంధిత బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు.
సత్యవేడు ఎమ్మెల్యే మాట్లాడుతూ….. సత్యవేడు నియోజకవర్గం లోని పలు ఎస్సీ, ఎస్టీ లకు సంబంధించిన సమస్యలపై వివరిస్తూ.. త్వరితగతన సమస్యల పరిష్కారానికి సంబంధిత మండలస్థాయి, డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి అధికారులు దృష్టి పెట్టాలని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కు సంబంధించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణం కోసం స్థల సేకరణ కు పనులను పూర్తి చేయాలని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస యోజన కింద గృహాల మంజూరు విషయాలలో గృహ నిర్మాణ శాఖ వారు అర్హతను పట్టి మంజూరు చేయాలని తెలిపారు.సూళ్లూరుపేట ఎమ్మెల్యే మాట్లాడుతూ….. తమ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ చెందిన భూములు, ఇళ్ల పట్టాలు వంటి సమస్యలపై వివరిస్తూ అందరికీ న్యాయం జరిగేలా పరిష్కారం చూపాలని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కు సంబంధించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణం కోసం స్థల సేకరణ కు పనులను పూర్తి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, డీఎస్పీలు, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీఓ లు రామ్మోహన్ , భాను ప్రకాష్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి, పి ఓ ఐ టి డి సి శ్రీనివాస్, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి హరీష్, బిసి వెల్ఫేర్ డిడి భరత్ రెడ్డి, డి ఆర్ డి ఏ పిడి శోభన్ బాబు, డి ఎమ్ అండ్ హెచ్ ఓ బాలకృష్ణ నాయక్, వ్యవసాయ శాఖ డి డి ప్రసాద రావు, ఆర్ అండ్ బి ఎస్ ఈ, రాజా నాయక్, కార్మిక శాఖ అధికారి చిన్న లాలప్ప, డీవీఎంసి సభ్యులు, జిల్లా అధికారులు, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.



