Andhra Pradesh

ఏపీ సీఎం,, కేంద్ర మంత్రులకు పక్కడ్బెందిగా బందొబస్త్…. జిల్లా ఏస్పీ

తిరుపతి జిల్లా: తిరుపతి జిల్లా ఏస్పీ యల్. సుబ్బారాయుడు ఐపీస్, మాట్లాడుతు….. రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లి మండలం, ముక్కావారిపల్లి సమీపంలో నిర్వహించనున్న (జీ-రామ్) కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో
సభా ప్రాంగణాన్ని భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించమన్నారు.అనంతరం బందోబస్తు విధులకు వచ్చిన పోలీసు అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి,
జాతీయ స్థాయిలో ప్రాధాన్యత కలిగిన ఈ కార్యక్రమంలో ప్రతి అధికారి అత్యంత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. వీఐపీల రాక నుంచి కార్యక్రమం ముగిసే వరకు భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, ఎయిర్పోర్టు నుంచి సభా ప్రాంగణం వరకు రూట్ బందోబస్తు, ఎస్కార్ట్, ట్రాఫిక్ నియంత్రణలో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు చేపట్టుతునమన్నారు.
హెలిప్యాడ్, వీఐపీ ప్రవేశ మార్గాలు, గ్రీన్రూమ్లు, ప్రధాన వేదిక, ఫోటో ఎగ్జిబిషన్ ప్రాంతం, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు తదితర కీలక ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. వీఐపీల ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో యాక్సెస్ కంట్రోల్ను కట్టుదిట్టంగా అమలు చేయాలని, సభా ప్రాంగణంలోని ప్రతి సెక్టార్కు బాధ్యత గల అధికారులను నియమించి సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నమన్నారు.
మఫ్టీలో పోలీసు సిబ్బందిని మోహరించి అనుమానాస్పద వ్యక్తులు, అవాంఛనీయ సంఘటనలపై నిరంతర నిఘా ఉంచాలని, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా సభా ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
విధుల్లో ఉన్న ప్రతి అధికారి తనకు కేటాయించిన ప్రాంతంలో తప్పనిసరిగా హాజరై సిబ్బంది అందరూ రిపోర్ట్ చేసినట్లు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు తెలియజేయాలని, క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలనలు నిర్వహించి ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభానికి ముందే అన్ని బందోబస్తు పాయింట్లలో అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో విధుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ట్రాఫిక్ నిర్వహణలో భాగంగా చిట్వేలు, రైల్వే కోడూరు వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తామని, సాధారణ వాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు తెలిపారు. సభకు వచ్చే ప్రజల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసి తాగునీరు, మార్గదర్శక సూచికలు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమానికి హాజరయ్యే వీఐపీలు, ప్రజాప్రతినిధులు, వేలాదిగా వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర భద్రతా ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సుమారు వెయ్యు మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడిస్తూ, సభకు హాజరయ్యే ప్రజలందరూ పోలీసు సిబ్బంది సూచనలను పాటించి భద్రతా నిబంధనలకు సహకరించాలన్నారు.
ఈ సమీక్ష సమావేశం మరియు పరిశీలన కార్యక్రమంలో రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్, ఐపీఎస్., అదనపు ఎస్పీలు శ్రీనివాసులు (పరిపాలన), కులశేఖర్ (రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్), ఎస్బీ డీఎస్పీ గీతా కుమారి, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button