Andhra Pradesh

సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు…. డి ఏస్పీ

తిరుపతి జిల్లా, రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్, ఆదేశాల మేరకు, రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలో 2026 జూలై 1 వ తేదీ నుండి జూలై నెల 31 వ తేదీ వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్‌కు సంబంధించిన నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాస రావు పత్రిక ప్రకటన లొ తెలిపారు.ఈ సందర్భంగా రేణిగుంట డి ఏస్పీ వై. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, పోలీసు శాఖ నుండి ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు మరియు ఇతర గుంపులుగా నిర్వహించే కార్యక్రమాలు నిర్వహించరాదని సూచించారు.అలాగే రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలోని రేణిగుంట, గాజులమండ్యం, ఏర్పేడు, రైల్వే కోడూరు, ఓబులవారిపల్లె, చిట్వేల్, పుల్లంపేట మరియు పెనగలూరు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు.
అనంతరం పై నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button