జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా జర్నలిస్టుల ఆందోళన

కడప జిల్లా,రాజంపేట: చిత్తూరు జిల్లా, వి.కోటలో ఆంధ్రజ్యోతి జర్నలిస్టుగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి అవినీతి, అధర్మం, అన్యాయం పై వార్తలు వ్రాసినాడని నేడు మంగళవారం తెల్లవారుజామున వాకింగ్ చేస్తుండగా అతి కిరతకంగా కొంతమంది రౌడీ షీటర్ లు తరిమి తరిమి కత్తులతో నరికి హత్య చేశారు. అందుకు నిరసనగా నేడు రాజంపేట పట్టణంలోని ” తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘము మరియు ఏపీ డబ్యూజె మరియు ఏపీ డబ్ల్య్ జె యఫ్, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘల ఆధ్వర్యంలో నేడు రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం లో జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా ఆందోళన చేపట్టారు.ఈ ఆందోళనలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండించాలని, దాడులపై ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని,కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ హెచ్ ఎస్. భావన ఐఏఎస్,కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో…. కొర్రపాటి నాగరాజ ఆచార్య, రామచంద్రయ్య, కళ్యాణ్, ఈశ్వరయ్య, రఘురామ రాజు, భాస్కర్, సుబ్బ నరసయ్య, రమేష్, సురేష్, అశోక్ రెడ్డి, రవి ప్రసాద్, వెంకట రెడ్డి, కార్తీక్, దుర్గయ్య, ప్రసాద్, రెడ్డి ప్రసాద్, నరసింహ పలు జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.



