Andhra Pradesh
పెట్రోల్ బంక్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన…. జిల్లా కలెక్టర్

కడప జిల్లా: కడప నగర పరిధిలోని అలంఖాన్ పల్లి వద్ద ఇండియన్ ఆయిల్, దుర్గా హిందుస్థాన్ పెట్రోల్, డీజిల్ బంకులను నేడు సోమవారం జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతు…. ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ సరఫరా, నిల్వల విషయంలో ప్రజల్లో నెలకొన్న ఆందోళన పరిస్థితుల నేపథ్యంలో నిబంధనల మేరకే ఇంధనాన్ని వినియోగదారులకు సరఫరా చేయాలని సూచించారు.
అలాగే డీజిల్, పెట్రోల్ ఔట్లెట్లలో స్టాక్, సేల్స్ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని నిర్వహకులను ఆదేశించారు.



