Telangana

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు కృషి: కలెక్టర్.

పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా మార్చ్ 9: జిల్లా కలెక్టర్ శబరీష్,అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో,(రెవెన్యూ) కె.అనిల్ కుమార్,* జిల్లా అధికారులు, సంబంధిత మండలాల నుండి గూగుల్ మీట్ ద్వారా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.వివిధ సమస్యలపై ప్రజల చేసుకున్న దరఖాస్తులను సానుకూలంగా వింటూ సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు, స్వయంగా, ఈ సోమవారం వినూత్న రీతిలో మండల ప్రధాన కార్య స్థానం నుండి తహసీల్దారులకు గూగుల్ మీట్ ద్వారా ఆదేశాలు జారీ చేసి సమస్యను పరిష్కరించాలని తెలిపారు.ప్రజలు చేస్తున్న న్యాయమైన సమస్యలల దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత విభాగాల సిఫారసు చేయాలని లేదా సరియైన విధంగా సూచనలు, సలహాలు అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పెండింగ్ ఫైల్ లను క్లియర్ చేయాలని, పరిసరాలను పరిశుభ్రముగా ఉంచుకుంటూ, అనవసరమైన స్క్రాప్ ను ఖండం చేయాలని, అట్టి నివేదికను ప్రతిరోజు సమర్పించాలని అధికారులను ఆదేశించారు,
మండల ప్రత్యేక అధికారులు, సంబంధిత సిబ్బంది తరచుగా వారికి కేటాయించిన వసతి గృహాలు హాస్టలను విద్యాసంస్థలను తనిఖీ చేస్తూ విద్యార్థిని, విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని, వసతి గృహాలలో సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ( 136 ) దరఖాస్తులు వచ్చాయని వాటి పరిష్కారం నిమిత్తం తగు సూచనలు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.లీగల్ సెల్ ద్వారా న్యాయ సలహాలు సూచనలు సమస్యల పరిష్కారం కోసం (5) దరఖాస్తులు వచ్చాయని వారికి సరియైన పరిష్కారం చూపి పంపడం జరిగింది ప్యార లీగల్ వాలంటరీ విజయ్ కుమార్ తెలిపారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో తొర్రూరు రెవిన్యూ డివిజనల్ అధికారి గణేష్, జెడ్పి సీఈవో పురుషోత్తం, అన్ని విభాగాల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, గూగుల్ మీ ద్వారా తహసిల్దారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button