కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

పల్లె వాణి బయ్యారం, మార్చి 12:బయ్యారం మండలం చర్లపల్లి గ్రామపంచాయతీలో తహసీల్దార్ నాగరాజు అధ్యక్షతన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన 70 మంది మహిళలకు రూ.70 లక్షల విలువైన కళ్యాణలక్ష్మి చెక్కులను స్థానిక శాసనసభ్యులు కోరం కనకయ్య పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆర్ధిక ఒత్తిడులను తట్టుకుని కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ పథకాలను అమలుచేస్తోంది. పార్టీలకతీతంగా,పైరవీలు లేకుండా నిరుపేదలైన ఎంతో మంది పేద ప్రజలకు దరఖాస్తు చేసుకున్న కొన్ని రోజులకే చెక్కులను పంపిణీ చేయడం జరుగుతోంది.ఇంతమంచి కార్యక్రమాన్ని ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.దళితులు,గిరిజనులు,బడుగు,బలహీన వర్గాల ఇళ్లలో ఆడపిల్లల పెండ్లిల కోసం అప్పు చేసినటువంటి తల్లిదండ్రులను ఆర్ధికంగా ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికీ ముందుంటుందనీ ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ రావు,సోసైటీ మాజీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి,సర్పంచ్ లు భూక్యా ప్రవీణ్ నాయక్,బాలకృష్ణ,పార్వతి,లింగా నాయక్,సీఐ రవీందర్,ఎస్ఐ తిరుపతి,ఆర్ఐలు సందీప్,ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.



