23 న మహబూబాబాద్ లో వాహనాల వేలం: సి ఐ.

పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా ఏప్రిల్ 17:సారాయి, బెల్లం సరఫరా చేస్తూ వివిధ కేసులలో పట్టుబడినటువంటి వాహనాలను వరంగల్ డిప్యూటీ కమిషనర్ జి. అంజన్ రావు మరియు మహబూబాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి బి. కిరణ్ ఆదేశాల మేరకు 23.04.2026 గురువారం ఉదయం 11:00 గంటలకు ఎక్సైజ్ స్టేషన్ మహబూబాబాద్ లో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు సీఐ జి చిరంజీవి పేర్కొన్నారు. వేలం పాటలో పాల్గొనదలచిన వాహన ధర (అప్సెట్ ప్రైస్) లో 50% డిపాజిట్ చేయాలనీ,వాహనాల వివరాలు మహబూబాబాద్ లోని ఎక్సైజ్ కార్యాలయంలో ఉంటాయి అన్నారు. వేలంపాటలో పాల్గొనదలచిన వారు ముందుగా వాహనాలను చూసుకుని వేలం పాటలో పాల్గొనాలని,వేలంపాటలో పాల్గొని వేలంలో వాహనం వచ్చిన తర్వాత అట్టి వాహనం తీసుకోని యెడల అతని యొక్క డిపాజిట్ (జప్తు )చేయడం జరుగుతుంది.ఒకవేళ వేలంపాటలో పాల్గొని వాహనం రాకుంటే వారి డిపాజిట్ వారికి తిరిగి ఇవ్వబడును.దరఖాస్తు తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ కూడా సమర్పించవలెను.వేలంపాటకు దరఖాస్తులు 18.04.2026 నుండి 23.04.2026 ఉదయం 9:00 గంటల వరకు మాత్రమే తీసుకోబడతాయి.వేలం పాటలో వాహనం తీసుకున్నవారు అదే రోజు మొత్తం అమౌంట్ మరియు జీఎస్టీ తో కలిపి చెల్లించాలని సీఐ సూచించారు.



