ధాన్యం కొనుగోళ్లు, నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్.

పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా మే19: మంగళవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, నరసింహులపేట, చిన్న గూడూరు మండలాలలో కలెక్టర్ ఆకస్మిక విస్తృత పర్యటనలు చేశారు,
ఈ సందర్భంగా మండల కేంద్రంలో మక్కజొన్న, ధాన్యం,
పెద్దనాగారం, వసురుతండలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్వయంగా తనిఖీ చేశారు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తూ రికార్డులను సరిగా మెయింటైన్ చేయడం లేదనీ, ఇప్పటివరకు వచ్చిన ధాన్యం కొనుగోలు చేసిన ధాన్యం నాణ్యత ప్రమాణాలు, గన్ని సంచుల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిఓ, అగ్రికల్చర్ అధికారులపై కఠిన చర్యలు తీసుకొని విధుల నుంచి తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు,
జిల్లావ్యాప్తంగా అన్ని మక్కజొన్న, ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల నిర్వహణ రవాణా తదితర అంశాలలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరించడం జరిగిందని అయినా కొన్నిచోట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని అట్టి వారిని గుర్తించి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు,
ప్రభుత్వ నిబంధనల ప్రకారం దాన్యం మ్యాచ్చర్ వచ్చిన తర్వాతనే కూపన్ల ద్వారా కేటాయించాలని సూచించారు,
రవాణా చేయు సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకొని వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని, హమాలీలను అధికంగా అందుబాటులో ఉంచుకోవాలని లోడింగ్,అన్లోడింగ్ విషయంలో వేగంగా ముందుకు సాగాలని సూచించారు.
ఈ తనిఖీల్లో కలెక్టర్ వెంట జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై అధికారి రమేష్, మేనేజర్ నరసింహారావు, స్థానిక ఎంపీడీవో ఎమ్మార్వో తదితరులు ఉన్నారు.



