గార్లలో బాస్కెట్బాల్ పోటీలను ప్రారంభించిన డి.ఎస్.పి.

గార్ల లో నీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఎదుట గల బాస్కెట్బాల్ క్రీడా మైదానంలో సమ్మర్ క్రీడల ముగింపును పురస్కరించుకుని ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం మూడు జిల్లాల బాస్కెట్బాల్ పోటీలను మహబూబాబాద్ డివిజన్ డీఎస్పీ తిరుపతిరావు శనివారం సాయంత్రం ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడలలో పాల్గొనుట ముఖ్యమని, గెలుపొందుట కాదని తెలిపారు. చదువుతోపాటు విద్యార్థులు క్రీడలలో రాణించాలని ఆయన హితవు పలికారు. నిరంతర తెరఫీ ద్వారా క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవోభవ.. పెద్దలను గౌరవించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా వారి గురువు రవీందర్ ను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గార్ల బయ్యారం సిఐ రవీందర్ యాదవ్, గార్ల ఎస్సై, బి సాయికుమార్, గార్ల మండలం బాస్కెట్బాల్ ఫౌండర్ రామన్న గౌడ్, గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ పార్వతి హాతిరాం నాయక్, జిల్లా క్రీడల విభాగం బాధ్యులు జ్యోతి, పాఠశాల హెచ్ఎం శీలంశెట్టి వెంకటేశ్వర్లు, నిర్వాహకులు సూత్రపు జయశంకర్, రెఫరీలు మూడు జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు



