Telangana

ప్రజావాణిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: కలెక్టర్.

పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా జూన్ 1: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యల అధికారులు కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అనిల్ కుమార్, అదనపు కలెక్టర్ (ఇంచార్జ్ స్థానిక  సంస్థల) పురుషోత్తం పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి కలెక్టర్ స్నేహ శబరీష్ స్వయంగా వినతులను స్వీకరించారు. వారి సమస్యలను ఓపికగా విని, తక్షణ పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అదనపు కలెక్టర్లు అనిల్ కుమార్ మరియు (ఇంచార్జ్) పురుషోత్తం పర్యవేక్షణలో, ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను వర్గీకరించి, వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.ప్రజా సమస్యలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, పారదర్శకమైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.జూన్ 02న జరుపు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని, వచ్చిన అతిథులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని, ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున మంచినీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కువగా భూ సమస్యలు, పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు, రేషన్ కార్డులు, మరియు వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వినతులు ఎక్కువగా నమోదయ్యాయి.ప్రజావాణి కార్యక్రమం ల మొత్తం ( 142 ) దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.
ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా, అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్, జడ్పీ సీఈవో (హౌసింగ్ పీడీ) పురుషోత్తం, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిసిఓ వెంకటేశ్వర్లు, అన్ని విభాగాల అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, డివిజన్ కార్యాలయాలలో డివిజన్ స్థాయి అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button