గడవు దాటిన విత్తనాలు అమ్మితే ఉపేక్షించేది లేదు: ఏవో.

పల్లె వాణి గార్ల జూన్4: గడువు దాటిన విత్తనాలను రైతులకు అమ్మితే ఉపేక్షించేది లేదని ఏవో రామారావు స్పష్టం చేశారు. ఈ మేరకు గార్ల లోని పురుగు మందుల దుకాణాలలో సీడ్ టాస్క్ ఫోర్స్ ఎస్సై సాయికుమార్ తో కలిసి ఏవో తనిఖీలు నిర్వహించారు. విత్తనాల నిల్వలు లైసెన్స్ లు.స్టాక్ రిజిస్టర్ లు.. బిల్లు లు లేబులింగ్ మరియు నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. ఏవో మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి లేని బి టీ 3 (బిటి 3) విత్తనాలను షాపు యందు నిల్వ ఉంచినా రైతులకు అమ్మాజూపినా సంబంధిత డీలర్స్ పై కఠిన చర్యలు తీసుకొంటామని అనధికార లేదా గడువు దాటిన విత్తనాలు రైతులకు అమ్మితే ఉపేక్షించేది లేదని వారు హెచ్చరించారు.షాపు లో విత్తనాల నిల్వ బోర్డులు రైతులకు కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని విత్తనాలు అమ్మే సమయంలో రైతులకు బిల్లులు తప్పకుండా ఇవ్వాలని… బ్రాండెడ్ విత్తనాలు మాత్రమే రైతులకు అమ్మాలని రైతులు కోరిన విత్తనాలు మాత్రమే ఇవ్వాలని, స్టాక్ రిజిస్టర్ లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని,స్టాక్ రిపోర్ట్ స్టాక్స్ వచ్చిన వెంటనే వ్యవసాయ అధికారి కి తెలియజేయాలనీ అలసత్వం వహిస్తే శాఖా పరమైన కఠిన చర్యలు తప్పవని సూచించినారు. రైతులు విత్తనాలు కొనే ముందు అదీకృత లైసెన్స్ కలిగిన డీలర్స్ వద్దనే కొనుగోలు చేసి బిల్లును పంట సీజన్ ముగిసే వరకు భద్ర పరచు కోవాలని గ్రామాల్లో సంచరిస్తూ గుడ్డ సంచులలో లేబుల్ లేని విత్తనాలు అమ్మే వారి వద్ద విత్తనాలు కొని మోసపోవద్దని సూచించారు



