Kadapa

రైతుల పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు: మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు

కొయ్యలగూడెం (బోడిగూడెం): ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెం పంచాయతీ పరిధిలో ప్రతిపాదిత ఆయుధ కర్మాగారానికి (ఆర్డినెన్స్ డిపో) వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటానికి పోలవరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తెల్లం బాలరాజు గారు తన సంఘీభావాన్ని ప్రకటించారు. మంగళవారం ఆయన స్థానిక రైతులతో కలిసి నిరసనలో పాల్గొని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదికి మూడు పంటలు పండే అత్యంత సారవంతమైన భూములను నాశనం చేసి, ఇక్కడ ఆయుధ డిపో నిర్మించాలనే ఆలోచన సరికాదని ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని, రైతుల పొట్ట కొట్టే పనులు మానుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు చేస్తున్న ఈ ధర్మపోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని, వారికి సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బాలరాజు గారితో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు మరియు స్థానిక ప్రతినిధులు మరియు (ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు) మంతెన సోమరాజు,చిక్కాల దుర్గాప్రసాద్ (ఏలూరు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్) తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button