Andhra Pradesh

ఏటా 15 శాతం వృద్ధి రేటు సాధనకు అవకాశం ఉన్న ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలి

ఏలూరు, జూన్, 5 : జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో సాగుకు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలనీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో శుక్రవారం జిల్లా సమీక్షా సమావేశం మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో గత సమావేశంలో ప్రజాప్రతినిధులు తెలిపిన అంశాలపై తీసుకున్న చర్యలు, ఖరీఫ్ సంసిద్ధత, వ్యవసాయ, అనుబంధ రంగాలు, పి .ఎం. సూర్య ఘర్ యోజన ప్రగతి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, జలధార, ఇరిగేషన్ ఓ అండ్ ఎం పనుల ప్రగతి, తదితర అంశాలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, ఎంపీ (రాజ్యసభ) పాకా సత్యనారాయణ, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, సొంగా రోషన్ కుమార్, ప్రభృతులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button