Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Andhra Pradesh

తాళాల అలవాటు గమనించి ఇంట్లో దొంగతనం చేసిన మహిళ అరెస్ట్…. సీఐ మద్దేయ్య ఆచారి

తిరుపతి : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్. ఆదేశాల మేరకు జిల్లాలో దొంగతనాలపై కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో చంద్రగిరి సబ్ డివిజన్ డీఎస్పీ బి. ప్రసాద్ పర్యవేక్షణలో తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు, ఇంటి యజమాని ఇంట్లో దొంగతనం చేసిన మహిళను అరెస్ట్ చేసి నగదు మరియు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మద్దయ్యాచారి నేడు మంగళవారం ప్రెస్మిట్ లో తెలిపిన వివరాల ప్రకారం, తిరుపతి నగరంలోని సాయి నగర్ ప్రాంతంలో నివసిస్తున్న వెంకటముని రెడ్డి ఇంటి కింద అంతస్తులో అద్దెకు ఉంటున్న నిందితురాలు వి. సంధ్య @ సంజు (20), నివాసం: బైరాగిపట్టెడ, నారాయణ కాలేజీ ఎదురుగా ఇంటి యజమాని భార్య ఇంటి తాళాలను పూల కుండి వద్ద ఉంచి బయటకు వెళ్లే అలవాటును గమనించిన నిందితురాలు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంటిలోకి ప్రవేశించి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించినట్లు విచారణలో ఒప్పుకుంది.దొంగిలించిన ఆభరణాలలో కొన్నింటిని కర్ణాటక రాష్ట్రంలోని బంగారుపేట ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తికి విక్రయించి రూ.1,40,000/- నగదు పొందినట్లు తెలిపింది. అలాగే రెండు బంగారు ఉంగరాలను తన భర్త ద్వారా వి. కోటలోని జగదాంధ పాన్ బ్రోకర్స్ వద్ద కుదవ పెట్టినట్లు విచారణలో వెల్లడైంది. అదేవిధంగా ఇటీవల మరలా అదే ఇంటిలోకి ప్రవేశించి మరికొన్ని బంగారు ఆభరణాలను దొంగిలించినట్లు నిందితురాలు తెలిపింది. పోలీసులు నిందితురాలి ఇంటిని తనిఖీ చేయగా అక్కడి నుండి నగదు మరియు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన సొత్తు వివరాలు:లాంగ్ చైన్ – 50 గ్రాములు, రెండు గుండ్ల లాంగ్ చైన్ – 44 గ్రాములు,బంగారు నెక్లెస్ – 24 గ్రాములు,మూడు బంగారు ఉంగరాలు – 11 గ్రాములు,బంగారు కమ్మలు – 2 గ్రాములు,మొత్తం 130 గ్రాముల బంగారు,ఆభరణాలు మరియు రూ.1,40,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన సొత్తు మొత్తం విలువ సుమారు రూ.16,00,000/- (పదహారు లక్షలు)గా అంచనా వేయడం జరిగింది. నిందితురాలిని నేడు మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు అరెస్ట్ చేసి, స్వాధీనం చేసిన నగదు మరియు బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. ఈ కేసు దర్యాప్తు తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మద్దయ్యాచారి ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీరాములు మరియు పోలీస్ సిబ్బంది నిర్వహించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button