Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Telangana

మున్సిపల్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన కలెక్టర్.

పల్లె వాణి మహబూబాబాద్ మార్చి 11:పట్టణంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఆకస్మికంగా తనిఖీ చేశారు.ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చ్ 6 నుండి జూన్ 12 వరకు షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందనీ, అందులో భాగంగా గత రెండు మూడు రోజుల నుండి జిల్లా స్థాయి ప్రత్యేక అధికారులు అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలలో ఫైళ్ల క్లియరెన్స్, సానిటేషన్, కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది అన్నారు.
జిల్లా కలెక్టర్ తమ పర్యటనలో భాగంగా మున్సిపల్ కార్యాలయ పరిసరాలను పరిశీలించి ఫైళ్లను వెంటనే క్లియరెన్స్ చేయాలని, అనవసరమైన స్క్రాప్ ను వెంటనే ఖండం చేయాలని, సూచించారు.సుమారు గంటన్నరకు పైగా కార్యాలయంలో ఆమె తనిఖీలు నిర్వహించి స్వయంగా ఫైళ్లను పరిశీలించారు.వివిధ పనుల దరఖాస్తుల నిమిత్తం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల యొక్క వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, వారి సమస్యలను సావధానంగా పరిశీలించి వారికి తగిన విధంగా పరిష్కారం చూపాలని తెలిపారు.మున్సిపల్ పరిధిలో అంతర్గత ఫైళ్ల క్లియరెన్స్, అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని, నగర పరిధిలో ఉన్నటువంటి కాలనీలలో విద్యుత్, త్రాగునీరు సరఫరా లో ఎలాంటి అంతరాయాలు లేకుండా చూడాలని, సానిటేషన్ షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని, ఆదేశించారు,
జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన మండలాలు, ప్రాంతాలలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోతు జ్యోతి, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, తహసిల్దార్ రాజేశ్వరరావు, సంబంధిత అధికారులు ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button