Ananthapuram

జిల్లా పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ఉచిత మెగా వైద్య శిబిరం

అనంతపురం జిల్లా, అనంతపురం పోలీస్ ప్రధాన కార్యాలయం లో నేడు బుధవారం జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఐపీస్, ఆధ్వర్యంలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వారిచే క్యాన్సర్ నిర్ధారణ మరియు ఇతర ఆరోగ్య సమస్యలపై పరీక్షలు నిర్వహించారు. ఉచిత మెగా వైద్య శిబిరంలో భారీగా పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు సంబంధించి టెస్టులు చెకప్స్ చేయించుకున్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ
ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే క్యాన్సర్ ప్రాణాంతకం కాదని,క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అవగాహన చాలా ముఖ్యమని అలాగే ఏదైనా అనుమానం కలిగితే వెంటనే డాక్టర్లను సంప్రదించి తగు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వంటి వ్యాధులపై అవగాహన కల్పించారు.వయస్సు, జన్యుపరమైన కారణాలు లేదా అలవాట్ల వల్ల వచ్చే క్యాన్సర్లను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.
కాన్ఫరెన్స్ హాలులో పురుషులు, మహిళలు కోసం వేర్వేరు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఫిజిషియన్, గైనకాలజీ తదితర విభాగాలకు చెందిన నిపుణులైన డాక్టర్లచే హెల్త్ చెకప్‌లు నిర్వహించారు.
అనంతరం బసవతారకం హాస్పిటల్‌కు చెందిన ప్రత్యేక బస్సు ద్వారా అత్యాధునిక పరికరాలతో నిపుణులైన డాక్టర్లు, టెక్నీషియన్లు క్లినికల్ ఎగ్జామినేషన్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా, ఏ.ఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, జిల్లా మాజీ గ్రంథాలయ ఛేర్మన్ & నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షులు గౌస్ మహమ్ముద్దీన్, హైదరాబాద్ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ గైనకాలజిస్టులు జ్యోతి, మాన్విత, జనరల్ ఫిజీషియన్ రవిశంకర్, రేడియాలజిస్ట్ ప్రభాకర్, మేనేజర్ లక్ష్మణ్, సి.ఐ లు ధరణికిశోర్, క్రాంతికుమార్, ఆర్.ఐ లు పవన్ కుమార్, మధు, జిల్లా పోలీసు అధికారుల సంఘం సభ్యులు మరియు పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button