బయ్యారం ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక.

పల్లె వాణి బయ్యారం, ఏప్రిల్ 5:బయ్యారం మండల నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండల కేంద్రంలో రిజిస్ట్రేషన్ 348/2021 ప్రెస్ క్లబ్ కార్యాలయంలో సీనియర్ జర్నలిస్ట్ నాయిని ఇంద్రారెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించగా నూతన కమిటీని ఎన్నుకున్నారు.మూడోసారి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సంకపల్లి సుమన్ రెడ్డి,ప్రధాన కార్యదర్శిగా దారావత్ వెంకట్రావు,ఉపాధ్యక్షుడిగా బానోత్ స్వామి,సహాయ కార్యదర్శిగా చామర్తి వినయ్ కుమార్,కోశాధికారిగా భూక్యా మంగు పాటు గౌరవ సలహాదారులుగా షేక్ జీలని,నాయిని ఇంద్రారెడ్డి ని సభ్యులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అనంతరం నూతన ప్రెస్ క్లబ్ కమిటిని షేక్ యుసాఫ్ పాషా,రామసహాయం ప్రకాష్ రెడ్డి, కేస మునీందర్,పాముల విద్యాసాగర్,సపవత్ సంతోష్,కపిల్ చౌదరి నీలారపు సంపత్ యాదవ్ లు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సుమన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని విధాలుగా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని అన్నారు. తనను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న క్లబ్ సభ్యులందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



