పారదర్శకతకు పెద్దపీట – పోలీస్ సిబ్బందికి న్యాయమైన బదిలీలు… జిల్లా ఏస్పీ.

తిరుపతి జిల్లా : తిరుపతి సూపర్ డెంట్ అఫ్ పోలీస్ కార్యాలయంలో నేడు శనివారం జిల్లా ఏస్పీ, యల్. సుబ్బారాయుడు ఐపీస్, కాన్ఫరెన్స్ హాల్ నందు కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ స్థాయి వరకు సాధారణ బదిలీల కౌన్సిలింగ్ను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ సిబ్బంది ఈ కౌన్సిలింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ, ప్రతి ఒక్క సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలు, కుటుంబ పరిస్థితులు, పని అనుభవం, ఆప్షన్లు తెలుసుకుని పూర్తిస్థాయి పారదర్శకతతో బదిలీలు నిర్వహించారు. ఎలాంటి ఒత్తిళ్లు, సిఫార్సులు, పక్షపాతం లేకుండా న్యాయంగా బదిలీలు చేపట్టడంతో పోలీస్ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ మాట్లాడుతూ…. పోలీస్ శాఖ బలోపేతానికి సిబ్బంది సంతృప్తి చాలా ముఖ్యం, విధుల్లో నిబద్ధతతో పనిచేసే ప్రతి పోలీస్ సిబ్బందికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటమన్నారు.పారదర్శకత, క్రమశిక్షణ, పనితీరుకే ప్రాధాన్యం ఇస్తాంమని
సిబ్బంది సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ ఉండదనన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే ముందుగా పోలీస్ సిబ్బందిలో ఉత్సాహం, నమ్మకం పెరగాలని,అందుకే ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవిస్తూ బదిలీలు నిర్వహిస్తున్నాంమని తెలిపారు.
అంతేకాకుండా, కొత్తగా బదిలీ అయిన స్థానాల్లో కూడా ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలని, శాఖ ప్రతిష్టను పెంచేలా కర్తవ్య నిర్వహణ చేయాలని
సూచించారు.
ఈ కార్యక్రమంలో…. అదనపు ఎస్పీ లు వెంకట్రావు (పరిపాలన) శ్రీనివాస్ (క్రైమ్స్) శ్రీలత (మహిళా పోలీస్ స్టేషన్ గీతా కుమారి (ఎస్ బి) ఏవో సురేష్ బాబు పాల్గొన్నారు.



