Andhra Pradesh

మైనారిటీ యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రంగా జి. పుల్లయ్య మరియు రవీంద్ర ఇంజనీరింగ్ కళాశాలలు

.పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో నేడు మైనారిటీ యువతకు నైపుణ్య శిక్షణ కేంద్ర ప్రారంభోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు.ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ పీఎం వికాస్ పథకంలో భాగంగా, మైనారిటీ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో మైనారిటీ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని దీక్షతో జి. పులయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని ట్రైనింగ్ సెంటర్ గా గుర్తించి నేడు ప్రారంభత్సవ వేడుక నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శ్రీ ఎన్.ఎం.డి ఫరూక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ శాఖ మంత్రివర్యులు విచ్చేశారు.గౌరవ అతిథులుగా కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి మరియు సబిహ పర్వీన్ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి విచ్చేశారు.
ఈ కార్యక్రమం రవీంద్ర విద్యాసంస్థల అధినేత శ్రీ జి. పుల్లయ్య అధ్యక్షతన నిర్వహించబడినది.
అధ్యక్ష ఉపన్యాసంలో పుల్లయ్య మాట్లాడుతూ
పుల్లయ్య మరియు రవీంద్ర కళాశాలలు ట్రైనింగ్ సెంటర్లుగా గుర్తింపు పొందినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని. ఈ కార్యక్రమం ద్వారా మైనారిటీ విద్యార్థులు, మహిళలు వారి నైపుణ్యాలను మెరుగుపరచుకొనటానికి గొప్ప అవకాశం అని తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మైనారిటీ యువత కు ఎంతో మేలు జరుగుతుందని, ఉజ్వల భవిష్యత్తుకు మార్గం లాంటిది అన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తద్వారా దేశానికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టడం సంతోషదాయకమని ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేపట్టాలని తద్వారా దేశాభివృద్ధికి తమ సంస్థలు కూడా ఒక భాగమైనందుకు తనకెంతో గర్వంగాను ఆనందంగానూ ఉందని తెలియజేశారు. ముఖ్య అతిథి శ్రీ ఎన్.ఎం.డి ఫరూక్ మాట్లాడుతూ
పీఎం వికాస్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మైనారిటీ కమ్యూనిటీల యువతకు, ముఖ్యంగా మహిళలకు ఆధునిక మరియు సాంప్రదాయ నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడం మరియు శిక్షణ పొందిన వారికి ఉపాధి, స్వయం ఉపాధి మరియు వ్యవస్థాపకత అవకాశాలను మెరుగుపరచడం అలాగే నాయకత్వ అభివృద్ధి మరియు వ్యవస్థాపకత శిక్షణ ద్వారా మైనారిటీ మహిళల ఆర్థిక స్వాతంత్ర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచడం అని తెలియజేశారు. కనుక మైనారిటీ యువతలు అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ డాక్టర్ సి. శ్రీనివాసరావు, డాక్టర్ కె.ఈ. శ్రీనివాసమూర్తి మరియు విభాగాధిపతులు మైనారిటీ విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button