Telangana

రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడి పొందాలి:ఏఓ.

పల్లె వాణి గార్ల మార్చ్5: రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు పొందాలని గార్ల మండల వ్యవసాయ అధికారి కే రామారావు రైతులకు సూచించారు.గార్ల మండలంలోని గోపాలపురం శివారులోనీ వరి పంట క్షేత్రాన్ని సందర్శించి రైతుల తో మాట్లాడారు. తెగుళ్ల పట్ల అవగాహన తో సరి అయిన మందులు సరి అయిన సమయంలో మోతాదు ప్రకారం పిచికారీ చేయడం వలన మంచి పంట దిగుబడులు పొందవచ్చునని ఏ ఓ అన్నారు. వరి పంట లో వచ్చే తెగుళ్ళు పురుగులు పట్ల అప్రమత్తత అవసరం అని.. ప్రస్తుతం యాసంగి వరి లో కాండం తొలిచే పురుగు జింక్ లోపం బాక్టీరియా తెగుళ్ళు గమనించడం జరిగిందని వీటి నివారణకు కార్టాప్ హైడ్రో క్లోరైడ్ అనే మందును 2గ్రాములు ఒక లీటర్ నీటికి ప్రోపినెబ్ లేదా Z78 అనే మందుతో కలిపి పిచికారీ చేయాలని… కాంప్లెక్స్ ఎరువులు మరియు యూరియా మోతదు కు మించి వాడరాదని యూరియా ను దపాలుగా మరియు పొటాష్ ను చిరు పొట్ట దశ లో యూరియా తో కలిపి వాడాలని కాంప్లెక్స్ ఎరువులను పై పాటుగా ఎట్టి పరిస్థితి లో వాడ రాదని సమగ్ర పోషక మరియు సమగ్ర సస్య రక్షణ చర్యల వివరాల కొరకు మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని ఏవో పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button