
భద్రాది జిల్లా:మార్చి 27 శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శుక్రవారం జరిగే సీతారాముల కళ్యాణం మహోత్సవం శనివారం జరిగే శ్రీ రామ మహాపట్టాభిషేకం కోసం భద్రాది ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మిథిలా స్టేడియంలో శిల్ప కళాశోభిత కళ్యాణ వేదికపై సీతారాముల పరిణయ వేదిక శుక్రవారం వైభవంగా జరగనుంది, తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా భద్రాదికి చేరుకుంటున్నారు.దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో కాసేపట్లో లోక కల్యాణానికి సర్వం సిద్ధమైంది. భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు అట్ట హాసంగా సాగుతున్నాయి. సీతారాముల కల్యాణానికి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. భక్తకోటి మురిసేలా ఘనంగా ఏర్పాట్లు చేశారు. రాములోరి కల్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా కన్నులారా వీక్షించి తరించేందుకు భక్తకోటి పెద్దఎత్తున తరలి వస్తున్నారు.సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొన్నారు.



