కార్పొరేట్ కళాశాలలో అడ్మిషన్ల కొరకు దరఖాస్తుల ఆహ్వానం: శ్రీనివాసరావు.

పల్లె వాణి మహాబాబాబాద్ జిల్లా,మే.07:2026-27 సంవ.రానికి కార్పొరేట్ కళశాలల ప్రవేశ పథకములో భాగంగా ఉత్తమ కళాశాలలను ఎంపిక చేయడానికి, జిల్లాలోని ప్త్రెవేట్ జూనియర్ కళాశాలల నుండి దరఖాస్తులు ఆహ్వనించడం జరుగుచున్నదని జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ది ఆధికారి శ్రీనివాసరావు నేడు ఒక ప్రకటన లోతెలిపారు.ఎంపిక చేసిన కళాశాలలకు విద్యార్థులను (విద్యార్థుల ఆప్షన్ ప్రకారము) ప్రతి సంవత్సరము కేటయించబడునని ఇందుకుగాను కార్పొరేట్ కళాశాలల పథకములలోని విద్యార్థులను ఫీజు, బుక్స్, హాస్టల్ వసతి, భొజన వసతి గాను,ఇతర అవసరములకు ప్రతి విద్యార్థికి రూ. 35,000/- చొప్పున చెల్లింపబడునని అన్నారు. మరియు పాకెట్ మనీ గాను ప్రతి విద్యార్థికి రూ.3000/- చొప్పున చెల్లింపబడునని అన్నారు. మరియు ఎంసెట్ కోచింగ్ ప్రీగా ఇవ్వబడునని, ప్రవేశాలకు దరఖాస్తు చేయు కళాశాలలు ఈ క్రింది సౌకర్యాలు తప్పని సరిగా ఉండవలెనని,
అన్ని ప్రాథమిక సౌకర్యాలతో కూడిన మంచి, సరిపడా నివాస వసతి. కళాశాల భవనం నిర్మాణపరంగా పటిష్టంగా ఉండాలి మరియు అగ్నిమాపక భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.తరగతి గదులు, వసతి గృహం, హాస్టళ్లు, ఇండోర్ & అవుట్‌డోర్ కార్యకలాపాలు మొదలైన వాటికి తగినన్ని మౌలిక సదుపాయాలు.
గత కొన్నేళ్లుగా కనీసం 50% మార్కులతో ఫస్ట్ క్లాస్ మరియు డిస్టింక్షన్లు సాధించి, 90% కంటే ఎక్కువ ఉత్తీర్ణతతో నిలకడైన అకడమిక్ ట్రాక్ రికార్డ్. ఐఐటి/జెఇఇ/ఎఐఇఇఇ/ఇఎఎమ్‌సెట్ వంటి ప్రవేశ పరీక్షలలో నిలకడగా అధిక విజయ శాతం.
అనుభవజ్ఞులైన అధ్యాపకులు మరియు సుసజ్జితమైన ల్యాబ్ మరియు లైబ్రరీ. అధ్యాపకుల సివిలను కమిటీ పరిశీలిస్తుందన్నారు.
గుర్తించిన కళాశాలలు ఒకే జిల్లాలో ఉండవలసిన అవసరం లేదని
ఇంకా, ఈ పథకం కింద కళాశాల కొనసాగింపు అనేది విద్యార్థులు సాధించే ఫలితాలు మరియు వారి నుండి వచ్చే ఫీడ్‌బ్యాక్‌పై కూడా ఆధారపడి ఉంటుందన్నారు.కళాశాలల దరఖాస్తులను (epass.telangana.gov.in) వెబ్ సైట్ నందు నమోదు (అప్లయ్) చేసుకొనుటకు చివరి తేది: 11.05.2026 అని అధికారి పేర్కొన్నారు.



