Andhra Pradesh

సీఎంఆర్ఎఫ్ తోపేదల ఆరోగ్యానికి భరోసా – చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్

చింతలపూడి : ఎంతోమంది పేద, బడుగు బలహీన వర్గాల ఆరోగ్యం మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి తన సహాయనిధి ఆదుకుంటున్నారని శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో 33 మందికి సుమారు 18 లక్షల రూపాయలు సీఎం సహాయం చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనారోగ్యానికి గురై ఆర్థికంగా స్తోమత లేని ఎన్నో పేద కుటుంబాల వారికి ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపకరిస్తుందని రోషన్ కుమార్ పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలో ఇవ్వని విధంగా తమ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు ఇచ్చి ఆ యొక్క కుటుంబాలను ఆదుకుంటున్నారని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిలారు సత్యనారాయణ, గరిమెళ్ళ చలపతిరావు, కొండ్రెడ్డి కిషోర్, కుక్కల మాధవరావు, చింతా విష్ణు, తాటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button