Telangana
మహబూబాబాద్ లో రోడ్డు ప్రమాదం యువకుడు మృతి.

పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా జూన్ 13: మహబూబాబాద్ లో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సర్వేపల్లి రాధాకృష్ణ సెంటర్ సమీపంలో బైక్ ను టిప్పర్ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు.కేసముద్రం మండలంలోని బడి తండా కు చెందిన భూక్య నవీన్ బైకుపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



