Telangana
సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్.

పల్లె వాణి ఏప్రిల్ 19,మహబూబాబాద్ జిల్లా,ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా (నేడు) అనగా ఏప్రిల్ 20, నుండి వారం రోజులు సంక్షేమ వారోత్సవాలు (సోమవారం మొదటి రోజు ప్రారంభం) సందర్భంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా యంత్రాంగం సంక్షేమ వారోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా క్షేత్రస్థాయిలో జిల్లా అధికారులందరూ నిమగ్నమై ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
కావున ప్రజలు ప్రజావాణి దరఖాస్తులతో ఈ సోమవారం కార్యాలయమునకు రావద్దని ఆమె కోరారు.



